కలప అక్రమ రవాణాపై నిఘా
రాజవొమ్మంగి: కలప అక్రమ రవాణాపై నిఘా పెంచామని అటవీక్షేత్రాధికారి గుమ్మిడి ఉషారాణి తెలిపారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.మారుజాతి, మామిడి, జీడిమామిడి కలపను తరలిస్తే చర్యలు తప్పవన్నారు. పొలాల్లోని చెట్లు నరికేందుకు రైతులు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. రైతుల దరఖాస్తులు పరిశీలించిన తరువాత వాటిని కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. సొంత చెట్లు అయినప్పటికీ అనుమతి తప్పనిసరిగా పొందాలని ఆమె సూచించారు.
96వేల మొక్కలు ఉత్పత్తికి చర్యలు
ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో పాపంపేట వద్ద ఏర్పాటుచేయనున్న నర్సరీలో 96 వేల మొక్కలు ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని అటవీక్షేత్రాధికారి గుమ్మిడి ఉషారాణి వెల్లడించారు. ఈ నర్సరీలో మారుజాతి, కరివేపాకు, జామ, కానుగ, నల్లమద్ది, పూలజాతి మొక్కలను పెంచి రైతులకు ఉచితంగా అందజేస్తామన్నారు. మండలంలోని ఉర్లాకులపాడు వద్ద గల సెంట్రల్ నర్సరీ నుంచి ఈ ఏడాది 35 వేల టేకు దుంపలను రైతులకు సరఫరా చేయాలని నిర్ణయించామన్నారు. వన్యప్రాణుల జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజవొమ్మంగి అటవీక్షేత్రాధికారి ఉషారాణి
Comments
Please login to add a commentAdd a comment