పార్కింగ్‌కు డబ్బులు వసూలు చేస్తే చర్యలు
కలెక్టర్ దినేష్‌కుమార్ హెచ్చరిక
డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రం చాపరాయిలో పార్కింగ్‌కు టెండర్ నిర్వహించకుండా డబ్బులు వసూలు చేస్తే పంచాయతీ సిబ్బంది, చాపరాయి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చాపరాయి వద్ద ప్రస్తుతం హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి పూర్తయిన తరువాత పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో వాహనాల పార్కింగ్‌కు టెండర్ నిర్వహించి వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పారు. పర్యాటక సీజన్‌లో ప్రత్యేక థింసా కార్యక్రమం ప్రతి రోజు సాయంత్రం 5నుంచి గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరగాలని ఆదేశించారు. చాపరాయి ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. స్థానిక మండల పరిషత్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, తహసీల్దార్ కార్యాలయాలను ఆయన తనిఖీ చేశారు.
చిరుధాన్యాలతో ఆర్థికాభివృద్ధి : చిరుధాన్యాల సాగుతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. గురువారం సాగర పంచాయతీ బలియాగుడలో ఓ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రుణ ధాన్యాల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గిరిరైతులు పండించిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమంలో డీపీఎం భాస్కర్‌రావు, ఏడీవో నందు, తహసీల్దార్ నాగమ్మ, వ్యవసాయ అధికారిణ/ నీలవేణి, సంస్థ ప్రతినిధులు. ఆర్‌ఐ హరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment