ఘాట్‌లో బుల్లెట్ దగ్ధం
● వంజంగి హిల్స్‌కు వెళ్తుండగా
వేడెక్కిన ఇంజిన్
● ఒక్కసారిగా ఎగసిన మంటలు
● దూకేసి ప్రమాదం నుంచి
బయటపడిన పర్యాటకులు
పాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండకు వెళ్లే ఘాట్ మార్గంలో ఆదివారం తెల్లవారు జామున ఓ బుల్లెట్ దగ్ధమైంది. ఇద్దరు పర్యాటకులు వంజంగి మేఘాల కొండకు బుల్లెట్‌పై బయలుదేరారు. ఘాట్ మార్గంలో వెళ్తుండగా ఇంజిన్ వేడెక్కడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారు వెంటనే బైక్‌పైనుంచి దూకేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అయితే దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment