సిరిసామ పద్ధతిలో మంచి దిగుబడి
విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాత్రో
డుంబ్రిగుడ: సామను గిరిజన ప్రాంతంలో సిరిసామ పద్ధతిలో సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని విజయనగరం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త పాత్రో సూచించారు. సోమవారం సొవ్వ పంచాయతీ కరకవలసలో సామ రైతులకు సాగు విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదజల్లే పద్ధతిలో సాగు చేస్తే కేవలం రెండు నుంచి మూడు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుందన్నారు. అదే వాసన్ సంస్థ రైతులకు పరిచయం చేసిన సిరిసామ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అనంతరం పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడేరు డాట్ సెంటర్ శాస్త్రవేత్త ప్రదీప్, వ్యవసాయ శాఖ నుంచి ప్రకాష్, వసన్ సంస్ధ నుంచి సన్యాసిరావు, సంజీవని సంస్థకు చెందిన దేవుళ్లు హాజరయ్యారు. సొవ్వ సచివాలయం హార్టికల్చర్ ఆసిస్టెంట్ రాములమ్మ, గిరిజన రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment