రైతులకు సూచనలిస్తున్న ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ అశోక్ కుమార్
డుంబ్రిగుడ: అరకు కాఫీ పంటకు అంతర్జాతీ యంగా గుర్తింపు ఉండేలా నాణ్యత ప్రమాణా లు పాటించాలని ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ ఎన్.ఆశోక్‌కుమార్ సూచించారు. మండలంలో ని సొవ్వ పంచాయతీ సాగరవలస, గసభ పంచాయతీ గొందివలస, మొర్రిగుడ, సాగర గ్రామాల్లో సోమవారం కాఫీ గింజల సేకరణ, ఐటీడీఏ, జీసీసీ ప్రకటించిన మద్దతు ధరలపై గిరిజనులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ, జీసీసీ కాఫీ పండ్లు కిలో రూ.44, పార్చ్‌మెంట్ కాఫీ రూ.285, చెర్రీ కాఫీకి రూ.150 చొప్పున ధరలు ప్రకటించాయన్నారు. అందుకు తగ్గట్టుగా నాణ్యత ప్రమాణాలు పాటించి మద్దతు ధరను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాఫీ ఉద్యానవన అధికారి ఎస్.మత్స్యరాజు, ఫీల్డ్ కన్సల్టెంట్లు, జీసీసీ సిబ్బంది, లైజన్ వర్కర్లు, కాఫీ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment