నిబంధనలు పాటించాల్సిందే
చింతపల్లి: పర్యాటక ప్రాంతాల్లో రిసార్టుల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని చింతపల్లి డీఎస్పీ షేక్ షహజాన్ అహ్మద్ ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో లంబసింగి, తాజంగి, పెదబరడ పంచాయతీల్లో రిసార్టుల నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యాటకుల రాక పెరుగుతుండటంతో రిసార్టుల ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రిసార్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రిసార్టులకు వచ్చే వారి వివరాలను రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. పారిశుధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నిర్వాహకులకు ఎటువంటి సమస్య తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని డీఎస్పీ ఆదేశించారు. సీఐ వినోద్‌బాబు, ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు.
రిస్టార్టుల నిర్వాహకులకు
చింతపల్లి డీఎస్పీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment