● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పథకంలో మూడు నెలల బకాయిల చెల్లింపు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు ఏదైనా కారణంతో పింఛన్ సొమ్ము తీసుకోని పక్షంలో మూడు నెలల వరకు పింఛన్ బకాయిలు చెల్లిస్తామన్నారు. మూడు నెలలు వరుసగా పింఛన్ తీసుకోని పక్షంలో సంబంధిత పింఛన్‌దారులను శాశ్వత వలసలుగా గుర్తించి, పింఛన్ నిలిపివేస్తామని పేర్కొన్నారు. తరువాత ఆయా పింఛన్‌దారులంతా ఎంపీడీవోల ద్వారా రోల్ బ్యాక్ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే పింఛనుదారుడు మృతిచెందితే జీవిత భాగస్వామికి పింఛన్ అమలుజేసేలా ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment