అక్రమ మైనింగ్‌ను ఉపేక్షించం
సీసీఎఫ్ బీఎన్‌ఎన్ మూర్తి
రాజవొమ్మంగి: అక్రమ మైనింగ్‌ను ఉపేక్షించేది లేదని రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బీఎన్‌ఎన్ మూర్తి అన్నారు. శనివారం ఆయన స్థానిక అటవీక్షేత్ర కార్యాలయాన్ని సందర్శించారు. రేంజ్ పరిధిలో ఉన్న మైనింగ్ రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలోని 8 జిల్లాలకు చెందిన మూడు అక్రమ మైనింగ్‌పై కేసులు నమోదు చేసి కోర్టులో వేశామన్నారు. సిబ్బంది కొరత పరిష్కారానికి రిక్రూట్‌మెంట్ జరగాల్సి ఉందన్నారు. అడవుల సంరక్షణలో ఫ్రంట్‌లైన్ ఆఫీసర్లు బీవోలు, ఏబీవోల బాధ్యత కీలకమన్నారు., అయితే దాదాపు 350 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఉపాధిహామీ నిధులతో సుమారు 350 హెక్టార్లలో వివిధ జాతులకు చెందిన వనాలు పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ఫైర్‌లైన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది తమ పరిధిలోని ఏర్పాటు చేసిన 35 నర్సరీల ద్వారా కోటి మొక్కల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులకు ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. రంపచోడవరం డీఎఫ్‌వో రవీంద్ర దామా, సబ్‌డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, రేంజ్ అధికారి ఉషారాణి, ఎఫ్‌ఎస్‌వో రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment