ముగిసిన ఏయూ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో అరకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల తొలి స్థానాన్ని కై వసం చేసుకుంది. పురుషుల విభాగంలో ద్వితీయ స్థానంలో ప్రగతి ఫిజికల్ ఎడ్యుకేషన్, తృతీయ స్థానంలో సాలూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిలిచాయి.
● మహిళల విభాగంలో ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు తొలి స్థానం కై వసం చేసుకున్నారు. ద్వితీయ స్థానంలో ఎంఆర్ కళాశాల, తృతీయ స్థానంలో విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిలిచాయి.
33 కళాశాలలు.. 620 మంది క్రీడాకారులు
44 ఈవెంట్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించగా 33 కళాశాలలకు చెందిన 620 మంది క్రీడాకారులు హోరాహోరీగా పోటీ పడ్డారు. 100 మీటర్లు, లాంగ్ జంప్, జావెలిన్, 400 మీటర్స్ హర్డిల్స్, క్రాస్ కంట్రీ క్రీడల్లో ఉత్కంఠ భరిత పోరు జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య నరసింహారావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలుగా నిలిచిన క్రీడా జట్లను అభినందించారు. ఏయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ ఆచార్య ఎన్. విజయ మోహన్‌తో కలిసి విజేతలకు ట్రోఫీలు, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి ఆచార్య పల్లవి, వర్సిటీ అనుబంధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, రీసెర్చ్ స్కాలర్స్, ఎంపీఈడీ విద్యార్థులు పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో
అరకు ప్రభుత్వ కళాశాల
మహిళల విభాగంలో
ప్రగతి కాలేజీకి ప్రథమస్థానం
Comments
Please login to add a commentAdd a comment