బీఈ, బీటెక్ సెమిస్టర్‌పరీక్షలు వాయిదా
విశాఖ సిటీ: ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌లో ఈ నెల 29న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం నేపథ్యంలో ఏయూలో జరగాల్సిన బీఈ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు తెలిపారు. ఈ నెల 27, 28 29 తేదీల్లో జరగాల్సిన బీఈ/బీటెక్ 4/1 సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 30, డిసెంబర్ 2, 3 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనున్నట్లు వెల్లడించారు.
గిరిజన మహిళకుప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స
● చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో నిర్వహణ
చింతపల్లి: స్థాని క ఏరియా ఆస్పత్రిలో తొలిసారిగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహిళకు ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స అందించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ జి ప్రభావతి తెలిపారు. మోకాలు అరుగుదల వల్ల నొప్పులతో బాధపడుతున్న గిరిజన మహి ళకు ఆర్థోపెడిక్ వైద్యాధికారి సాయికృష్ణ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా చికిత్స చేసినట్టు ఆమె వివరించారు. కీళ్ల నొప్పులు నయం చేసే ఈ చికిత్స పొందాలంటే ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. గిరిజన ప్రాంతంలో కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు ఏరియా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందాలన్నారు. వైద్యాధికారి సాయికృష్ణను ఆమె అభినందించారు. వైద్యాధికారి రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment