సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఒక వైపు కూటమి నేతలు అందినకాడికి ఇసుక, మద్యం, అధికారుల పోస్టింగ్ వ్యవహారాల్లో జేబులు నింపుకుంటుంటే.. వారి సిఫారసులతో పోస్టింగ్‌లు దక్కించుకున్న అధికారులు అదే బాటలో పయనిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలోని ఓ సీఐ విశాలాక్షినగర్‌లో నిర్మిస్తున్న తన సొంత ఇంటికి అవసరమైన సామగ్రిని.. స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారికి అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు క్వారీ యజమానులతో కుమ్మకై ్క అక్రమాలకు సహకరిస్తూ.. భారీగా లబ్ధి పొందుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక నర్సీపట్నం నియోజకవర్గంలోని సీఐ ఉదయం లేవగానే అధికార పార్టీ నేత వద్ద హాజరు వేసుకుంటూ అక్కడి నుంచే ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్‌కు సైతం హాజరవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి జిల్లాలో ఏ స్టేషన్‌లో అయితే నాలుగున్నరేళ్లు పోస్టింగ్‌లో ఉన్నారో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్టేషన్‌కు ఏరికోరి వేయించుకున్నారు మరో సీఐ. ఆయన వచ్చిన వెంటనే క్వారీ యజమానుల నుంచి భారీగా వసూళ్లకు తెగబడుతున్నట్టు తెలుస్తోంది. సర్వీసు నిబంధనల మేరకు లూప్‌లైన్‌కే పరిమితం కావాల్సిన ఓ ఎస్‌ఐ అయితే అధికార పార్టీ నేతల ఆమ్యామ్యాలతో కీలకస్టేషన్ దక్కించుకున్నాడు. మొత్తంగా యథా రాజ.. తథా మేమంటూ పోలీసు అధికారులు భారీగా అవినీతికి పాల్పడుతుండటం చర్చనీయాంశమైంది.
ఆమ్యామ్యాలతో కీలక స్టేషన్‌కు ఎస్‌ఐ
గతంలో ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహించిన సమయంలో గంజాయి వ్యవహారాల్లో హస్తం ఉందనే ఆరోపణలతో నాలుగు లైఫ్ ఇంక్రిమెంట్లలో కోత పడిన ఎస్‌ఐ.. ఇప్పుడు కీలకమైన స్టేషన్‌లో పోస్టింగ్ దక్కించుకోవడంతో పాటు గంజాయి, క్వారీ యజమానుల నుంచి మామూళ్లు మొదలు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీసు నిబంధనల మేరకు ఆ ఎస్‌ఐని లూప్‌లైన్‌కే పరిమితం చేయాల్సి ఉన్నప్పటికీ.. అధికార పార్టీ నేతల అమ్యామ్యాలతో కీలకస్టేషన్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment