ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. రాజకీయ నాయకులు పోస్టింగులకు డబ్బులు దండుకుంటే.. వారి అండదండలతో కీలక పోస్టింగులు దక్కించుకున్న అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీస్ అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. తాను నిర్మిస్తున్న విశాల భవంతికి అన్ని సమకూర్చుకునే పనిలో ఓ సీఐ.. పాత పరిచయాలతో మరోసారి నెలవారీ మామూళ్లు షురూ చేశారు మరో సీఐ. గంజాయి బ్యాచ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగే ఎస్ఐ... ప్రతీ రోజూ ఉదయం ఠంచన్‌గా ఓ నేత వద్ద హాజరు వేసుకుని, తర్వాత కలెక్షన్ల మొదలెడుతోంది మరో సీఐ.. వీరి వసూళ్లతో ఆయా పోలీస్స్టేషన్లు అవినీతికి అడ్డాగా మారిపోయాయి. ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment