అనకాపల్లి జిల్లాలోని మరో సీఐ గతంలో నగరంలో కీలక విభాగంలో పనిచేసిన సమయంలో బ్లాక్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముఠా, రేషన్ మాఫియా ముఠా నుంచి భారీగా మామూళ్లు దండుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనకాపల్లి జిల్లా పరిధిలో నాలుగున్నరేళ్లు పనిచేసిన స్టేషన్లో ఇప్పుడు మరోసారి పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ స్టేషన్ పరిధిలోని క్వారీ యజమానులతో పాటు గంజాయి సరఫరా బ్యాచ్‌తో మంచి సంబంధాలు ఉన్న ఈ సీఐ.. మరోసారి అక్కడే పట్టుబట్టి మరీ పోస్టింగ్ దక్కించుకున్నారు. వచ్చిన వెంటనే పాత పరిచయాలతో అక్రమాలకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment