ఎలక్ట్రికల్ రంగంలో ఉపాధి అవకాశాలు
మాట్లాడుతున్న డీజీఎం సతీష్‌కుమార్
మురళీనగర్ (విశాఖ): ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని ఆదానీ గంగవరం పోర్టు ఎలక్ట్రికల్ విభాగం డీజీఎం కె.సతీష్‌కుమార్ అన్నారు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగం 5వ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించిన వర్క్‌షాప్ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించాలంటే సబ్జెక్టుపై పట్టు సాధించడంతోపాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని సూచించారు. ప్రవీణ్‌బా ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సర్వీసెస్, ఓడిన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహించారు. శిక్షణ విభాగం ట్రైనర్ టి.రవిచంద్రన్ విద్యార్థులకు ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న అవకాశాలు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment