గిరిజనేతరుల బెడద తప్పించాలి
● చీడికాడలో కోనాం ఆదివాసీల ధర్నా
తహసీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కోనాం ఆదివాసీలు
చీడికాడ: గిరిజన గ్రామమైన కోనాం గ్రామంలోని 17 ఎకరాల 78 సెంట్ల భూమిని గిరిజనేతరులకు కేటాయించారని, ఆదివాసీలకు న్యాయం చేయాలని గుంటి గ్రామస్తులు సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ ఆదివాసీ గౌరవ సలహాదారు పి.ఎస్.అజయ్‌కుమార్ మాట్లాడుతూ గుంటి గ్రామానికి చెందిన ఆదివాసీలకు సర్వే నెంబరు 275, 287లలో ఈ సీలింగ్ భూమి ఉందని, ఈ భూమిని తరతరాలుగా వారే సాగు చేస్తున్నారని చెప్పారు. కాని సరైన పరిశీలన లేకుండా, ఈ భూమిని గిరిజనేతరుల పేరున పట్టాలు మంజూరు చేశారని చెప్పారు. ఈ భూములను జిరాయితీ భూములుగా మార్చడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. సాగులో వున్న ఆదివాసీలకు పట్టాలు మంజూరు చేయాలని 2015వ సంవత్సరం నుంచి వినతిపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. చట్టవిరుద్ధంగా సీలింగ్ భూములకు పట్టాలు పొందిన వారు చోడవరం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓఎస్ 41/2003 కేసును దాఖలు చేశారని, రెవెన్యూ అధికారులు కోర్టుకు హాజరై, వాస్తవాలు వివరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment