బిల్లులు కాజేసిన అధికారులపై ఫిర్యాదు
అచ్చుతాపురం (మునగపాక): అచ్చుతాపురం మండలం పూడిమడకలో పలు భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను కాజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పూడిమడక మాజీ ఉప సర్పంచ్ చోడపల్లి అప్పారావు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ విజయకృష్ణన్ దృష్టికి సమస్య తీసుకువచ్చారు. రైతు భరోసా అలాగే హెల్త్ సెంటర్ నిర్మాణానికి కాంట్రాక్టర్‌గా తాను రూ. 18 లక్షలకు పైగా ఖర్చు చేశానన్నారు. అయితే పంచాయతీ రాజ్ డీఈ, ఏఈలు బిల్లులను కాజేశారని వారిపై చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని అప్పారావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment