‘సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కండి’
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి
నర్సీపట్నం: శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శుల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ పార్టీ 99 ఏళ్లు పూర్తి చేసుకుని వందో ఏట అడుగుపెడుతోందన్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం కావాలన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల అభివృద్ధికి నాయకులు కృషి చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం, పార్టీ నిధిని సకాలంలో వసూలు చేసి జిల్లాకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు మాకిరెడ్డి రామునాయుడు, రాజాన దొరబాబు, పార్టీ శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment