విపత్తుల నుంచి బయటపడండిలా..
పాయకరావుపేట : శ్రీ ప్రకాష్‌లో సోమవారం ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై స్కూల్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను అప్రమత్తం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు జాతీయ విపత్తు స్పందన దళం (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) 10 వ బెటాలియన్ టీం కమాండర్ వై.సత్యనారాయణ తెలిపారు. 10వ ఎన్‌డీఆర్‌ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ వి.వి.ఎన్ ప్రసన్న కుమార్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబరు 11 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు షెడ్యూలు ప్రకారం కోస్తా తీర మండలాల్లో గల గ్రామాలు, పాఠశాలలు, పరిశ్రమలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ ప్రకాష్‌లో విద్యార్థులకు ప్రమాదంలో గల వారిని కాపాడడం, సీపీఆర్, తదితర అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాయకరావుపేట తహాసీల్దార్ జి.సత్యనారాయణ, రెవెన్యూ సర్వేయర్ డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్రప్రసాద్, ఆర్‌ఐ టి.త్రినాఽథ్, వీఆర్‌ఓలు రాజేష్, సునీత, 2 వ మండల విద్యాశాఖాధికారి రమేష్, పోలీస్, ఫైర్, ప్రైమరీ హెల్త్ కేర్ సిబ్బంది పాల్గొన్నారు.
● వివరించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం
Comments
Please login to add a commentAdd a comment