నృత్య వైభవం
ఏయూక్యాంపస్: భగవాన్ బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని విశాఖలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాలు సోమవారం కొనసాగాయి. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా మైదానంలో జరిగిన ఈ సాంస్క్కతిక కార్యక్రమాలు నగరవాసులను అలరించాయి. ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పాయి. ఆదివాసీ మహిళలు, విద్యార్థులు గిరిజన సంప్రదాయాలను గుర్తుచేస్తూ చేసిన నృత్యాలు అందరి మనసులను గెలుచుకున్నాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన థింసా నృత్యం, కొమ్ము నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా ఆదివాసీ మహిళలు ఏకరూప దుస్తులు ధరించి చేసిన నృత్యాలు ఆదివాసీ జీవన వైవిధ్యతను చాటి చెప్పాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ ఉత్పత్తుల విక్రయాలకు మంచి ఆదరణ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment