రూ.4.65 లక్షల చోరీ సొత్తు రికవరీ
పాయకరావుపేట : వివిధ చోరీ కేసుల్లో దొంగలించిన సొత్తును రికవరీ చేసినట్టు డీఎస్పీ జి.ఆర్.ఆర్ మోహన్ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 15 వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో నోకియా సెల్‌ఫోన్ కంపెనీ ఉద్యోగి బీహార్‌కి చెందిన మహమ్మద్ దిల్సాద్ తుని రైల్వే స్టేషన్‌లో పూరి తిరుపతి రైలు దిగి నడుచుకుని సుగర్ ఫ్యాక్టరీ దరి ఎయిర్‌టెల్ కార్యాలయానికి వెళ్తుండగా ఫ్యాక్టరీ మలుపు వద్ద ముగ్గురు వ్యక్తులు పల్సర్ బైక్ పై వెనుక నుంచి వచ్చి అతనిని అటకాయించారు. మెడపై కత్తి పెట్టి భయబ్రాంత్రులకు గురిచేసి, చేతిపై కత్తితో గాయపరిచి అతని వద్ద నున్న లాప్‌ట్యాప్ బ్యాగు, వాచ్, సెల్‌ఫోన్‌ను దౌర్జన్యంగా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సీఐ, ఎస్‌ఐ టీం నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి 3 బైక్‌లను, ల్యాప్‌టాప్, వాచ్, పెన్‌డ్రైవ్, పర్సు, ఏటీఎం కార్డు రికవరీ చేశారు. సోమవారం సుమారు 10 గంటల సమయంలో తాండవ షుగర్ ఫ్యాక్టరీ వద్ద 3 మోటార్ బైక్‌లు, ఐదుగురు నిందితులను పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన సీఐ జి.అప్పన్న, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment