ఏయూలో విజిలెన్స్ వ్యవస్థ పటిష్టం
● వీసీ ఆచార్య శశిభూషణరావు
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పారదర్శకతను పెంపొందించే విధంగా విజిలెనన్స్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్లు వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. ఏయూ ప్రిన్సిపాల్స్, ఇతర అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై వర్సిటీలో టెండర్లు, కొటేషన్లు, సీపీసీలో ఉంచే ప్రతిపాదనల వంటివన్నీ విజిలెన్స్ అధికారి పరిశీలన, అనుమతితో మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిగే ఆర్థిక లావాదేవీలు, విత్త నిర్వహణ విజిలెనన్స్ అధికారి పరిశీలించి, వారి అనుమతి పొందిన తర్వాతే నిర్వహిస్తామన్నారు. ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కొనుగోలు చేసే పరికరాలకు విజిలెన్స్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సివిల్, ఎలక్ట్రికల్ వర్క్‌లో నిర్వహణ, వస్తువుల కొనుగోలు తదితర అంశాలలో విజిలెన్స్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యుడు టి.చిట్టిబాబును విజిలెన్స్ అధికారిగా ఇప్పటికే నియమించామని, ఆయన అన్ని అంశాలను పరిశీలించి అనుమతులిస్తారని చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ విభాగాల్లో నిర్వహించే సదస్సులు, సమావేశాల ఫోటోలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పొందుపరచాలని వీసీ తెలిపారు. దీనికోసం ఏయూ కంప్యూటర్ సెంటర్ నిర్వహణలో సిబ్బంది పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, డీన్‌న్స్,అధికారులు, హాస్టల్ చీఫ్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment