ఎస్పీ కార్యాలయంలో 43 అర్జీలు
ఆర్జీదారులతో మాట్లాడుతున్న అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 43 అర్జీలు వచ్చినట్లు అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్రావు చెప్పారు. అర్జీదారుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలపై దిగు సిబ్బందితో మాట్లాడి పరిష్కారం చేస్తామన్నారు. ఆస్తి తగాదాలు, కటుంబ సమస్యలు, చీటింగ్ తదితర అంశాలపై అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment