పీహెచ్‌సీలో శతశాతం ప్రసవాలు జరగాలి
● డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో వీరజ్యోతి
రోలుగుంట : పీహెచ్‌సీలో శతశాతం ప్రసవాలు జరిపించి, నిర్ణయించిన లక్ష్యాలను అధిగమించాలని పీహెచ్‌సీ సిబ్బందిని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, జిల్లా ప్రాజెక్టు అధికారి కె.వీరజ్యోతి ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం ఆమె సందర్శించారు. రోగులకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. ఓపీ గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారి శ్రావణి, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. గర్భిణులకు స్కానింగ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరోగ్య రికార్డు (కేస్ సీటు)లో నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో గర్భిణులందరి వివరాలు నమోదు చేసుకొని, శతశాతం ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీహెచ్‌ఈవో ఎస్.కృష్ణ, సరస్వతి, హెల్త్ సూపర్‌వైజర్ సాజహాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment