మైనింగ్ కార్యకలాపాలపై పోలీసుల ఆంక్షలు
స్టోన్ క్రషర్ల యాజమానులతో మాట్లాడుతున్న డీఎస్పీ శ్రావణి
తుమ్మపాల: క్వారీ వాహనాలు ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పట్టణ పరిధిలో రాకపోకలు చేయడానికి వీలులేదని డీఎస్పీ ఎం.శ్రావణి ఆదేశించారు. స్టోన్ క్రషర్ల యాజమానులతో పోలీస్ గెస్ట్ హౌస్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు. క్వారీలకు సమీపంలోని ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం జరగకుండా బ్లాస్టింగ్ చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులు స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయాల్లో ఇలాంటి కార్యకలాపాలు జరగరాదన్నారు. క్వారీల్లో వాడే పేలుడు పదార్థాలు సంఘ వ్యతిరేక శక్తుల వద్దకు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అటువంటి వ్యక్తుల వద్ద పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నప్పుడు క్వారీ యాజమాన్యం పాత్ర ఉన్నట్లు నిరూపణ అయితే వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment