వంట గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
గాస్ లీకై గాయాలైన చిన్నమ్మలు, కుమారుడు మహాలక్ష్మినాయుడు
బుచ్చెయ్యపేట : కేపీ ఆగ్రహారం గ్రామంలో ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒకే కుటుంబంలో ముగ్గురు గాయపడ్డారు. గ్రామానికి చెందిన సుంకర చిన్నమ్మలు సోమవారం తన ఇంట్లో వంట చేస్తుండగా రెగ్యులేటర్ వద్ద గ్యాస్ పైపు ఊడిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో చిన్నమ్మలుతో పాటు అతని భర్త అప్పలనాయుడు, కుమారుడు మహాలక్ష్మినాయుడు మంటలు ఆర్పే ప్రయత్నం చేయడంతో వారి కాళ్లు, చేతులు, ఒంటిపైన గాయాలై బొబ్బలెక్కాయి. వారిని బుచ్చెయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్య సేవల కోసం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిలిండర్లో తక్కువ గ్యాస్ ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని లేకపోతే గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment