పంపనూరు.. భక్తజన హోరు
ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచిన ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి క్షేత్రం ఆదివారం భక్త జనసంద్రమైంది. కార్తీక మాసం కావడంతో స్వామి దర్శనం కోసం ఉమ్మడి జిలా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు పెద్ద ఎత్తున సాగాయి. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మూలవిరాట్‌ను అలంకరించారు. కాలసర్పదోష నివారణ రాహుకేతు హోమాలు నిర్వహించారు. నిమ్మదొప్పులు, మట్టి ప్రమీదల్లో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment