ఆర్య వైశ్యులకు అండగా ఉంటా
అనంతపురం టవర్‌క్లాక్: ఆర్య వైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆదివారం స్థానిక కేటీఆర్ కన్వెన్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్‌తో పాటు వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంఎస్ రాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూపకుంట్ల శబరి వరప్రసాద్‌తో పాటు నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి భరత్ మాట్లాడుతూ... ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తన దృష్టికి తీసుకు వస్తే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. ఆర్య వైశ్య సత్రం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. పరిశ్రమల నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ... ఏ రాజకీయ పార్టీకి ప్రాధాన్యతనివ్వకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగడం ఆర్యవైశ్యుల విధేయతకు నిదర్శనమన్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, ఆర్య వైశ్య ప్రముఖులు సుబ్బరాయుడు, షణ్ముఖరావు, సిరిగుప్ప వెంకటేష్, విష్ణుతేజ, వంకదారు జయలక్ష్మి, అనిల్ కుమార్, సుజన్‌కుమార్, మిట్టా వంశీకృష్ణ, వెంకటకృష్ణ, కలవల సతీష్, ముడియం రమణ, గ్రంధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్
Comments
Please login to add a commentAdd a comment