ఉద్యోగ భద్రత కల్పించండి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూటమి సర్కార్‌ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్‌బాబు, అమరావతి జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్.ఎన్.దివాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి పి.ఎస్.ఖాన్ డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం భవన్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. చాలీచాలని వేతనం అందుకుంటున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. జీఓ 30, జీవో 7ను సవరించి న్యాయబద్ధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలన్నారు. ఏళ్లగా ప్రభుత్వ శాఖల్లో తక్కువ వేతనానికి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన ఏటా ఎంతో కొంత ఇంక్రిమెంట్ రూపంలో ఇవ్వాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెలా ఈఎస్‌ఐ కింద డబ్బులు చెల్లిస్తున్నా సరైన వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈఎస్‌ఐ, ఎంపానల్డ్ ఆస్పత్రుల యాజమాన్యంతో మాట్లాడి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రామకృష్ణ, గంగాద్రి, ప్రధాన కార్యదర్శులు రాఘవేంద్ర, రమేష్‌నాయక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment