జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం నెలకొంది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం నెలకొంది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Published Tue, Nov 26 2024 2:11 AM | Last Updated on Tue, Nov 26 2024 2:11 AM

-

ఓవర్‌టేకే

కొంప ముంచింది!

అనంతపురం సెంట్రల్‌: అవగాహన రాహిత్యంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయడంతోనే తలగాచిపల్లి క్రాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంపై రవాణాశాఖ, పోలీసు అధికారులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. దుర్ఘటనకు దారితీసిన కారణాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆర్టీఏ అధికారులు ఇప్పటికే నివేదికను కలెక్టర్‌కు అందజేసినట్లు తెలిసింది. ఆటోడ్రైవర్‌ యూటర్న్‌ తీసుకుంటుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గమనించలేదని తెలుస్తోంది. గార్లదిన్నె మండల కేంద్రంలోకి రాకపోకలు సాగించే వాహనాలు, తలగాచిపల్లి, తిమ్మంపేట గ్రామాలకు వెళ్లే వాహనాలకు అనువుగా ఆ ప్రాంతంలో జంక్షన్‌ ఏర్పాటు చేశారు. అతివేగంగా వాహనాలు వెళ్లకుండా స్పీడ్‌బ్రేకర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఓవర్‌ టేక్‌ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలిసింది. దీనికి తోడు జంక్షన్‌ ప్రాంతంలో లారీని కుడి వైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్‌ చేసినట్లు సమాచారం. ఓవర్‌టేక్‌ చేయకపోయినా, స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బస్సు వేగం తగ్గినా కూలీలు సురక్షితంగా బయటపడేవారు. కాగా, గతంలో జేఎన్‌టీయూ వీసీ సైతం ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం గమనార్హం. ఈ మార్గంలో ప్రమాదం జరిగిందంటే గాయాలతో బయటపడే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

దిద్దుబాటు చర్యలు..

తలగాచిపల్లి క్రాస్‌ వద్ద ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో దిద్దుబాటు చర్యలకు పోలీసు, రవాణాశాఖ యంత్రాంగం ఉపక్రమించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలను సీజ్‌ చేస్తున్నారు. అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా నష్టం జరిగిన తర్వాత రోడ్లపైకి వస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement