క్రీడలతో మానసికోల్లాసం
బుక్కరాయసముద్రం: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్ పేర్కొన్నారు. సోమ వారం మండలంలోని జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌లో 3వ క్రీడా మహోత్సవ్– 2024 ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రభుకుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు ఒత్తిడి తగ్గించుకునేందుకు రోజూ యోగా, వ్యాయా మం చేయాలన్నారు. ఏటా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడలు మనసుకు ఉత్తేజాన్నిస్తాయన్నారు. బెటాలియన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, పోలీసు సిబ్బంది సహకరించాలన్నారు. సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment