అనంతపురం: గంజాయి సేవిస్తూ పలువురు ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. రోజూ సాయంత్రం గంజాయి మత్తులో జోగుతున్న విద్యార్థులను గమనించిన పోలీసులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనంతపురంలోని ఐదు కళాశాలలకు చెందిన పది మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎస్పీ జగదీష్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లల ప్రవర్తన ఎలా ఉందనే అంశాన్ని పసిగట్టలేకపోవడం తల్లిదండ్రుల తప్పిదంగా భావించాల్సి వస్తుందన్నారు. గంజాయి విక్రేతలతో సంబంధాలు ఉన్నా... భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హెచ్చరికతో వదిలేస్తున్నామని, పునరావృతమైతే మాత్రం కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని విద్యార్థులను హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలకు కూడా ఇదే చివరి హెచ్చరిక అన్నారు. గంజాయి సేవిస్తూ విద్యార్థి పట్టుబడితే ఆ కళాశాల నిర్వాహకులపై కేసులు పెడతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment