●ఉల్లాసంగా... ఉత్సాహంగా
అనంతపురం: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సాగే పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 24 సోమవారం అనంతపురంలోని పరేడ్ మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఏఆర్, స్పెషల్ పార్టీ విభాగాలతో పాటు ఏడు సబ్‌డివిజన్లకు చెందిన పోలీసు క్రీడా బృందాలు పాల్గొన్నాయి. ఎస్పీ పి.జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై, క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. డిపార్ట్‌మెంటల్ ఉద్యోగాల్లో ఫిజికల్ ఫిట్నెస్ అనివార్యమని ఎస్పీ పి.జగదీష్ అభిప్రాయపడ్డారు. నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసు సిబ్బందికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇలియాజ్‌బాషా, డీఎస్పీలు వెంకటేష్, రవిబాబు, రామకృష్ణుడు, ఎస్‌బీ సీఐ ధరణికిషోర్, క్రాంతికుమార్, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, రాముడు, సీఐలు రాజేంద్రనాథ్‌యాదవ్, శ్రీకాంత్, శాంతిలాల్, కె.సాయినాథ్, పోలీసు అధికారుల సంఘం అడ్‌హక్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment