‘దౌర్జన్యంగా పునాదులు తవ్వేశారు’
వజ్రకరూరు: మండలంలోని ఎన్‌ఎన్‌పీ తండా జగనన్న కాలనీలో కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకున్న భూమిలో సోమవారం రాత్రికిరాత్రే జేసీబీతో పునాదులు తీసేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్‌సీపీ గిరిజన సంఘం నాయకుడు రామ్లానాయక్ ఆరోపించారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం తహసీల్దార్ నయాజ్ అహమ్మద్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రామ్లానాయక్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జనగన్న కాలనీలో గ్రామానికి చెందిన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించారన్నారు. ఈ స్థలాలను ఆక్రమించుకున్న కొందరు స్వార్థపరులు సోమవారం రాత్రి జేసీబీని ఏర్పాటు చేయించి పునాదులు తవ్వారన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమ ఇష్టమంటూ దౌర్జన్యానికి దిగారన్నారు. దౌర్జన్యపరుల ఆట కట్టించి పేదల స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ విచారణ చేపట్టి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment