![జిల్ల](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/hakey_mr-1738005404-0.jpg.webp?itok=3qKBIXh9)
జిల్లా అంతటా సోమవారం చలి వాతావరణం కొనసాగింది. ఉష్ణోగ్రత
గీత కార్మికులకు
14 మద్యం షాపులు
● 5 వరకూ దరఖాస్తులకు అవకాశం
● ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి
అనంతపురం: గీత కార్మికులకు జిల్లాలో 14 మద్యం షాపులను కేటాయించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ పద్ధతుల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఈడిగ–9, గౌడ్ –2, గౌడ–1, గౌండ్ల–1, కళాలి –1 ఉప సామాజికవర్గానికి షాపులు కేటాయిస్తామన్నారు. రూ.2 లక్షలు (నాన్ రీఫండబుల్) చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. దరఖాస్తుదారులు జిల్లా వాసులై ఉండాలన్నారు. అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్, గుంతకల్లు మునిసిపాలిటీ పరిధిలోని షాపులకు గౌడ, రాయదుర్గం రూరల్ షాపు–గౌడ, డీ హీరేహళ్ మండలంలో గౌండ్ల, తాడిపత్రి మునిసిపాలిటీలో కళాలి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం మునిసిపాలిటీ, కంబదూరు, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, బెళుగుప్ప, రాప్తాడు మండలాల్లో ఈడిగ ఉప కులం కేటగిరీ వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 7న కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారని వెల్లడించారు.
హాకీ టోర్నీ ప్రారంభం
అనంతపురం: అనంతపురం స్పోర్ట్స్ విలేజ్ (ఆర్డీటీ స్టేడియం)లో సోమవారం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ మెమోరియల్ 13వ రాష్ట్ర సబ్ జూనియర్ ఉమెన్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. హాకీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చాణిక్యరాజ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు విజయబాబు, సెక్రటరీ ఎస్.అనిల్ కుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి కృష్ణ టోర్నీని ప్రారంభించారు. మొదటి రోజు మ్యాచుల్లో నంద్యాల జట్టుపై చిత్తూరు, నెల్లూరుపై అన్నమయ్య, కర్నూలుపై తిరుపతి జట్లు విజయం సాధించాయి.
![జిల్లా అంతటా సోమవారం చలి వాతావరణం కొనసాగింది. ఉష్ణోగ్రత1](https://www.sakshi.com/gallery_images/2025/01/28/27ang35a-110010_mr-1738005404-1.jpg)
జిల్లా అంతటా సోమవారం చలి వాతావరణం కొనసాగింది. ఉష్ణోగ్రత
Comments
Please login to add a commentAdd a comment