అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్)ను జాతాయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఏపీ సీడ్స్.. గవర్నెన్స్ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, చైర్‌పర్సన్ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు.
అయితే మంగళవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్. గెడ్డం శేఖర్ బాబులు చూపించారు. దీనిపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధికారులను సీఎం జగన్ అభినందించారు.
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ రంగ సంస్థలకు ‘గవర్నెన్స్ నౌ’ అంతర్జాతీయ సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఏడాది పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్ నౌ అవార్డును ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment