గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత | CWC submitted report to Godavari Board | Sakshi
Sakshi News home page

గోదావరిలో 3,396.9 టీఎంసీల లభ్యత

Published Sun, Jul 9 2023 4:35 AM | Last Updated on Sun, Jul 9 2023 4:35 AM

CWC submitted report to Godavari Board - Sakshi

సాక్షి, అమరావతి  : గోదావరి జల వివాదాల (బచావత్‌) ట్రిబ్యునల్‌ అవార్డు అమల్లోకి వచ్చే నాటికి ప్రతి ఏటా గోదావరిలో మొత్తం 4,535.1 టీఎంసీల లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా అంచనా వేసింది. 75 శాతం లభ్యత ఆధారంగా 3,396.9 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది. నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో 1941–42 నుంచి 1979–80 వరకు వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా గోదావరిలో నీటి లభ్యతపై సీడ బ్ల్యూసీ ఈ అధ్యయనం చేసింది. గోదావరిలో సబ్‌ బేసిన్‌ వారీగా నీటి లభ్యత, బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపులను తేల్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో 75% లభ్యత ఆధారంగా 1,430 టీఎంసీల లభ్యత ఉందని 2004లో వ్యాప్కోస్‌ లెక్కేయగా,  సీడబ్ల్యూసీ తాజా అధ్య యనంలో 1,435 టీఎంసీల లభ్యత ఉన్నట్లు తేల్చింది.  వ్యాప్కోస్‌ అంచ నా కంటే సీడబ్ల్యూసీ అధ్యయనంలో 5 టీఎంసీలు అధికంగా ఉన్నట్లు స్ప ష్టమవుతోంది.

ఈ అధ్యయనం ప్రకారం ఉమ్మడి మధ్యప్రదేశ్‌కు 679.6 టీఎంసీలు, మహారాష్ట్రకు 951, కర్ణాటకకు 37.8, ఉమ్మడి ఏపీకి 1,435, ఒడిశాకు 293.6 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కే­టా­యించినట్లు అంచనా వేస్తూ సీడబ్ల్యూసీ ఇటీవల గో­దా­వ­రి బోర్డుకు నివేదిక స మర్పించింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అభిప్రాయాలను గో దావరి బోర్డు కో­రింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గోదావరి జ లాలపై 7 అ­ధ్య­యనాలు జరగ్గా సీడబ్ల్యూసీ చేసిన తాజా అధ్యయనం ఎనిమిదోది.

తాజా అధ్యయనం నేపథ్యం ఇదీ
ఏపీలో ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో చేపట్టే ప్రా జెక్టులకు 1,238.46 టీఎంసీలు (902.46 నికర, 336 మిగులు) అవసరమని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం పలు సందర్భాల్లో తెలిపింది. తెలంగాణ కూడా ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, భవి ష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు 1,767 టీఎంసీలు (967 నికర, 800 మిగులు) అవసరమని బోర్డుకు తెలిపింది.

2 రాష్ట్రాల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే 3,005.46 టీఎంసీలు అవసరం.  గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి, 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేశాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతివ్వాలని జనవరి 3న జరిగిన సర్వసభ్య సమావేశంలో 2 రాష్ట్రాలు బోర్డును కోరాయి. గోదా వరిలో సబ్‌ బేసిన్ల వారీగా నీటి లభ్యతను తేల్చకుండానే అప్పట్లో రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల ఆధారంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ జలాలను పంపిణీ చేసింది.

ఇదే అంశాన్ని వివరిస్తూ గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలని ఆంధ్రప్రదేశ్, తెలంగా­ణ కోరాయి. దీంతో బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డు వెలువడే నాటికి గోదావరిలో నీటి ల­­భ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జనవరి 19న సీడబ్ల్యూసీకి గో­­దా­వరి బోర్డు లేఖ రాసింది. బోర్డు ప్రతిపాదన మేరకు సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది.

40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్‌ వద్ద పురుడుపోసుకునే గోదావరి 1,465 కి.మీ పొడవున ప్రవహించి అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అంతర్వేది వద్ద బంగాళా ఖాతంలో కలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నదీ పరీవాహక ప్రాంతం ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 9.5 శాతంతో సమానం.

గోదావరి జలాలను బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ 1980 జూలై 7న బచావత్‌ ట్రిబ్యునల్‌ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అదే ఏడాది ఆ అవార్డును కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో 1941–42 నుంచి 1979–80 వరకు అంటే 40 ఏళ్లు గోదావరి బేసిన్‌లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ తాజాగా అధ్యయనం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement