సీఐ తల్లి హత్య కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : రాష్ట్రంలో సంచలనం రేపిన ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి పేరం స్వర్ణకుమారి హత్య కేసులో రెండో నిందితుడైన అనిల్‌కుమార్ ఆదివారం ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి, మదనపల్లె పట్టణంలోని సాయిరాంవీధిలో నివసిస్తున్న అనిల్‌కుమార్(25), అతని తల్లి రమాదేవి.. సెప్టెంబర్ 28న కనిపించకుండా పోయి హత్యకు గురైన స్వర్ణకుమారి హత్య కేసులో నిందితులు. ఇదే కేసులో ప్రధాన నిందితుడు వెంకటేష్‌ను అక్టోబర్ 9న, అతని తల్లి ఏ4గా ఉన్న ఎల్లమ్మను 10వ తేదీన మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో హత్య కేసులో రెండో నిందితుడైన అనిల్‌కుమార్, అతని తల్లి రమాదేవిలు పోలీసుల దర్యాప్తులో దొరకకుండా పరారీలో ఉన్నారు. అయితే అనిల్‌కుమార్ ఆదివారం గుట్టుచప్పుడు కాకుండా మదనపల్లెకు వచ్చారు. స్థానికంగా కొందరు అతడిని గుర్తు పట్టడంతో, తాము పోలీసులకు దొరికిపోతామన్న భయంతో తిరిగి పారిపోయాడు. ములకలచెరువు మార్కెట్‌యార్డు వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ఎవరూ గుర్తించకపోవడంతో రాత్రి మార్కెట్‌యార్డు వద్ద అపస్మారకస్థితిలో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపుగా 108 సమాచారం అందించి బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో స్పష్టంగా మాట్లాడలేక ఆస్పత్రికి చేరిన అనిల్‌కుమార్‌కు స్థానిక వైద్యులు చికిత్స అందించారు. ఈలోపుగా సీఐ తల్లి హత్య కేసులో నిందితుడు ఇతడేనని పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని అనిల్‌కుమార్‌కు పోలీసు పహారా ఏర్పాటు చేశారు. పోలీసుల పర్యవేక్షణలో సోమవారం మధ్యాహ్నం వరకు చికిత్స అందించారు. అనంతరం పోలీసులు అనిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆలస్యంగా గుర్తించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment