చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా అన్నారు. సోమవారం మదనపల్లె మండ లం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–17 నెట్‌బాల్ బాలికల విభాగం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వసంత, రాష్ట్ర అబ్జర్వర్ రామాంజనేయులు, ఎఈంఓ రాజగోపాల్, హెచ్‌ఎం ఆంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు నాగరాజ, నరేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్ అండర్–17 నెట్‌బాల్ బాలికల విభాగంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విశాఖపట్నం విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానం వెస్ట్‌గోదావరి, తృతీయస్థానం కృష్ణా జిల్లాలు సాధించినట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి వసంత తెలిపారు. రాష్ట్ర జట్టు డిసెంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు.
రాష్ట్ర జట్టుకు ఎంపికై న క్రీడాకారులు
హిందూజా (వెస్ట్ గోదావరి), వెంకటరేష్మ (వెస్ట్ గోదావరి), జాగారపు ప్రణతి(విశాఖపట్నం), సుప్రియ (కృష్ణ), సాత్విక (కడప), హన్సిక్ (అనంతపురం), కళ్యాణిరేవతి(ఈస్టు గోదావరి), భీష్మా (చిత్తూరు), భానుప్రియ (గుంటూరు), వర్షి (చిత్తూరు), రిషిత (విశాఖపట్నం)
స్టాండ్‌బైలు : చంద్రకళ (చిత్తూరు), శిరీషా (విశాఖపట్నం), పోషిత (వెస్ట్ గోదావరి), పూజిత (కృష్ణ), సింధూరి (వైఎస్సార్ కడప)
ఎమ్మెల్యే షాజహాన్‌బాషా
ఎస్‌జీఎఫ్ నెట్‌బాల్ విజేత విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment