ప్రజాధనం దుర్వినియోగం
● సాగునీటి కాలువలో సిమెంటు రోడ్డు ● ఆపాలంటున్న ఆయకట్టు రైతులు
ఓబులవారిపల్లె : మండల పరిధి రాళ్లచెరువుపల్లె గ్రామ సమీపంలోని కాలువలో ఇష్టానుసారంగా సిమెంట్ రోడ్డు వేసేందుకు కంకరను ఏర్పాటు చేశారు. రాళ్ళచెరువుపల్లె చెరువు నుంచి ఆర్‌సీ కొత్తపల్లి గ్రామానికి ఈ కాలువ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం వర్షాలు లేక కాలువలలో నీరు సాగడం లేదు. అదే అదునుగా కాలువలో తూము ఏర్పాటు చేయకుండా.. ఏకంగా సిమెంట్ రోడ్డు వేసేందుకు గుత్తేదారులు సిద్ధం చేస్తున్నారు. కేవలం తమ పంట పొలాల వద్దకు వెళ్లేందుకు చెరువు నుంచి వచ్చే కాలువలో అడ్డంగా రోడ్డు వేయడం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ పంటలు భవిష్యత్తులో ఎలా సాగు చేసుకోవాలని, పంట పొలాలను సాగు చేసుకోవాలంటే తూము ఏర్పాటు చేయాలని, కావున ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనావాసాలు లేని చోట సిమెంట్ రోడ్డును ఇస్టానుసారంగా వేయడం విడ్డూరంగా ఉందని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావున సంబంధిత అధికారులు కాలువలో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment