ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీసు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సబ్ డివిజన్, సర్కిల్, పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలన్నారు. బాధితుల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని చట్టపరిధిలో విచారణ చేసి, న్యాయం చేయడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే విచారణ చేసి సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment