మహిళ హత్య
కురబలకోట : కురబలకోట మండలం జంగావారిపల్లె కాలనీకి చెందిన రత్నమ్మ (35) హత్యకు గురయ్యారు. ఆదివారం సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ దిలీప్‌కుమార్ పరిశీలించారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చేలూరు ప్రాంతానికి చెందిన రత్నమ్మ (35) వివాహిత. భర్త, పిల్లలు ఉన్నారు. భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆరేళ్ల క్రితం మండలంలోని జంగావారిపల్లె కాలనీకి చెందిన రెడ్డి శేఖర్ అలియాస్ శ్రీనివాసులుతో ఓ మద్యం షాపు వద్ద ఈమెకు పరిచయం అయ్యింది. ఇద్దరూ మద్యం సేవించేవారు. ఇది కాస్తా సహజీవనానికి దారి తీసింది. కూలీ పనులతో కాలం గడిపేవారు. శనివారం రాత్రి వీరిద్దరూ గొడవ పడ్డారు. మరో వైపు ఆమైపె ఇతనికి అనుమానం.
దీంతో ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఆమె చనిపోయింది. శరీరంపై నల్లగా కమిలిన గాయాలు ఉండడంతో హత్యగా భావించి పోలీసులు మృత దేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment