సకాలంలో టీకాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో టీకాలు అందించాలి

Published Sun, Oct 20 2024 3:28 AM | Last Updated on Sun, Oct 20 2024 3:28 AM

సకాలం

పెదకూరపాడు : పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం, 75 తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి గీతాంజలి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న టీకాలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. సకాలంలో టీకాలు అందించాలని, రికార్డులను అప్డేట్‌గా ఉంచాలని సూచించారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

అచ్చంపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రుద్రవరం గ్రామంలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. మండలంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. రుద్రవరం గ్రామానికి చెందిన గడ్డం హనుమంతరావు(65) పశువులను మేపేందుకు రుద్రవరం–రోకటిగుంటవారిపాలెం గ్రామాల మధ్యగల పొలాలకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు వద్దకు వెళ్లే సమయంలో పిడుగుపాటుకు గురయ్యాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

సాగునీటి సమాచారం

తాడేపల్లిరూరల్‌ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 2,519 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. బ్యాంక్‌ కెనాల్‌కు 591, తూర్పు కెనాల్‌కు 90, కొమ్మమూరు కాలువకు 1,020 క్యూసెక్కులు వదిలారు.

హుండీ కానుకల లెక్కింపు

పెదకాకాని: శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో శనివారం హుండీ కానుకల లెక్కింపు ఆలయ డిప్యూటీ కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది. పెదకాకాని శివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గుంటూరు శ్రీఅగస్తేశ్వరస్వామి వారి దేవస్థానం ఈవో ఎన్‌ఎల్‌టీ సౌమ్య పర్యవేక్షణాధికారిణిగా విచ్ఛేశారు. 90 రోజులకుగాను రూ.40,49,823 నగదు ఆదాయం చేకూరింది. 24.700 మిల్లీ గ్రాములు బంగారం, 432 గ్రాములు వెండి , విదేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా లభించినట్లు ఆలయ డీసీ తెలిపారు. అన్నప్రసాద హుండీ ద్వారా రూ.54,658 ఆదాయం చేకూరిందని వివరించారు.

రాష్ట్ర జిమ్నాస్టిక్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌గా గుంటూరు

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): రాష్ట్ర జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జిమ్నాస్టిక్స్‌ అండర్‌–14, 17 బాలబాలిక చాంపియన్‌షిప్‌–2024ను గుంటూరు జిల్లా కై వసం చేసుకుంది. మూడు రోజుల నుంచి స్థానిక బీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న పోటీలు శనివారంతో ముగిశాయి. ద్వితీయ, తృతీయ స్థానాలలో తూర్పు గోదావరి, కడప జిల్లాలు నిలిచాయి. విజేతలకు డీఎస్‌డీఓ నరసింహారెడ్డి, సక్కు గ్రూప్‌ అధినేత మాధవి, రాయపాటి మమత బహుమతులు అందజేశారు. ఏపీ జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.సుబ్బారావు మాట్లాడుతూ పోటీలకు ఎంతో మంది సహకారం అందించారన్నారు. పోటీల నిర్వహణ భవిష్యత్తుకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో కోచ్‌ అఫ్రోజ్‌, డాక్టర్‌ కంచర్ల రామ్‌ప్రసాద్‌, శిరీష, జి.రాజేష్‌, కార్పొరేటర్‌ మీరావలి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సకాలంలో టీకాలు  అందించాలి 1
1/4

సకాలంలో టీకాలు అందించాలి

సకాలంలో టీకాలు  అందించాలి 2
2/4

సకాలంలో టీకాలు అందించాలి

సకాలంలో టీకాలు  అందించాలి 3
3/4

సకాలంలో టీకాలు అందించాలి

సకాలంలో టీకాలు  అందించాలి 4
4/4

సకాలంలో టీకాలు అందించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement