పిడుగురాళ్ల: రైలులో ఒంటరిగా ప్రయాణిస్తు న్న ముగ్గురు చిన్నారులను గుర్తించి గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు పిడుగురాళ్ల ఆర్‌పీఎఫ్ సీఐ కె.ఏడుకొండలు తెలిపారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీనిలోభాగంగా జనరల్, స్లీపర్ బోగీలను తనిఖీ చేయటంతో అందులో ముగ్గురు బాలురు హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నట్లు గుర్తించారు. వారు కూలి పనులకు వెళ్తున్నారని తెలపటంతో అనుమానంతో ఆర్పీఎఫ్ పిడుగురాళ్ల స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలురు ఓ అనుమానిత వ్యక్తితో కలిసి కూలిపనులకు వెళ్తున్నట్టు తెలిసిందని, వారిని రక్షించి గుంటూరు జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించామని పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.
ముత్తూట్ ఫైనాన్స్ రెడ్‌పై ఫిర్యాదులు
సత్తెనపల్లి:స్థానిక ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఖాతాదారులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదులు చేస్తున్నారు. ముప్పాళ్ళ మండలం నార్నెపాడుకి చెందిన వెల్లంపల్లి విజయ్‌కుమార్ 20 గ్రాముల బంగారు ఆభరణాలను కుదవపెట్టి గత ఏప్రిల్ 19న రూ.60 వేలు, ఆయన భార్య 33.5 గ్రాములు బంగారు నగలు కుదవ పెట్టి రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. 20 గ్రాములకు రూ.98 వేలు, 33.5 గ్రాములకు రూ.1,60,050 చెల్లించాలని చెప్పడంతో విజయ్‌కుమార్ అవాక్కయ్యాడు. ఎందుకు చెల్లించాలని ప్రశ్నించటంతో వాదోపవాదాలు జరిగాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తున్నా ఎక్కువ మొత్తంలో చూపుతూ అవకతవకలకు సిబ్బంది పాల్పడినట్లు ఆరోపించాడు. విచారించి న్యాయం చేయాలంటూ విజయ్‌కుమార్ పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment