కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం | Sakshi
Sakshi News home page

కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం

Published Wed, May 8 2024 3:15 AM

కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రామ్‌ కోఆర్డినేర్‌ డాక్టర్‌ వి.లక్ష్మీనారాయణమ్మ అధ్యక్షతన రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖాధికారి సూర్యనారాయణ మాట్లాడారు. 1974లో డాక్టర్‌ మోహన్‌సింగ్‌ మెహల్‌ కమిటీ సిఫారసు మేరకు దేశంలో మొదటగా పాండిచ్చేరిలో మొదటి కేవీకేను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 731 కేవీకేలు ఏర్పాటయ్యాయని వివరించారు. కేవీకే ఏర్పాటు ప్రధాన ఉద్దేశం నాణ్యమైన విత్తనాలు వినియోగించి రైతులు అధిక దిగుబడులు సాధించడమని తెలిపారు. రైతులు లాభసాటి వ్యవసాయం చేయడానికి కేవీకే శాస్త్రవేత్తలు కృషి చేస్తారని చెప్పారు. ప్రోగ్రామ్‌ కోఆర్డినేట్‌ర్‌ లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు వేసే విధంగా రైతులను చైతన్యం చేయడంతో పాటు విత్తనాల సరఫరాను కూడా చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యసాయాధికారి బాబూరావు, శాస్త్రవేత్త శివ, యశ్వంత్‌, రైతులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement