సర్వే ఉద్దేశం ప్రజలకు తెలపాలి
పాల్వంచరూరల్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సమగ్ర కుటుంబ సర్వే ఉద్దేశాన్ని ప్రజలకు వివరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశించారు. మండల పరిధిలోని పునుకుల గ్రామంలో శుక్రవారం అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో మాట్లాడారు. కేటాయించిన బ్లాక్ ప్రకారం ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని గుర్తించాలని చెప్పారు. శనివారం నుంచి 3వ తేదీ వరకు ఇళ్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రతీ కుటుంబానికి హౌస్ లిస్టింగ్ స్టిక్కర్లను అతికించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి తగిన ప్రణాళికలు రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోందని అన్నారు. ప్రజలందరూ ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, మండల పంచాయతీ అధికారి బి.నారాయణ, కార్యదర్శి బి.బాబూరావు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment