పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో హాజరుకాగా ఆలయం కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అమ్మవారికి సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.
ఆరోగ్య ఉప కేంద్రాలు విధిగా తెరవాలి
● డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్
మణుగూరు టౌన్: సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆరోగ్య ఉప కేంద్రాలు విధిగా తెరిచేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఏఎన్‌ఎంలు, ఫార్మాసిస్ట్‌లు, ఫీల్డ్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. సమన్వయంతో వ్యాధుల నివారణకు కృషి చేయాలని వైద్యుడు శివకుమార్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పీఓ ఎన్‌సీడీ మధు, వైద్యులు నిశాంత్‌రావు, గొంది వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
దుమ్ముగూడెం : మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పూసం వరుణ్ తేజ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. సిద్దిపేటలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 6,7,8 తేదీల్లో తమిళనాడులో జరిగే అండర్–17 పోటీల్లో పాల్గొంటాడని పాఠశాల హెచ్‌ఎం నరసింహారావు తెలిపారు.
ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బదిలీ
పాల్వంచ: కేటీపీఎస్ కాంప్లెక్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఎ.అప్పాజీని రాష్ట్ర సచివాలయానికి బదిలీ చేస్తూ ఎస్పీఎఫ్ డీజీ అనిల్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మణుగూరు బీటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ తిరుపతి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. గతంలో సెక్రటరీయేట్‌లో విధులు సమర్థంగా నిర్వహించిన అనుభవం ఉన్న అప్పాజీని తిరిగి అక్కడికే తీసుకున్నారు. కాగా గురువారం ఆయనకు ఎస్‌పీఎఫ్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలకగా, శుక్రవారం సెక్రటరీయేట్‌లో బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment