వన్యప్రాణుల సంరక్షణలో రాజీ పడొద్దు
పాల్వంచరూరల్ : వన్యప్రాణుల సంరక్షణలో రాజీ పడొద్దని వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ, డీసీఎఫ్ బి.బాబు అన్నారు. సోమవారం ఆయన గట్టుమల్ల, పునుకుడుచెలకలో నర్సరీలను పరిశీలించా రు. అనంతరం డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా డివి జన్ పరిధిలో గస్తీ పెంచాలని, అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నర్సరీలు, ప్లాంటేషన్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్య తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రేంజర్లు కవిత మాధురి, కనకమ్మ, ఎన్.కిరణ్‌కుమార్, ఎఫ్‌ఎస్‌ఓ శ్రీనివాస్, బీట్ అధికారి శోభన్‌బాబు పాల్గొన్నారు.
కేటీపీఎస్‌లో నిలిచిన విద్యుదుత్పత్తి
పాల్వంచ: సాంకేతిక సమస్య తలెత్తడంతో కేటీపీఎస్ 5వ దశలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9వ యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా సోమవారం రాత్రి ఉత్పత్తి నిలిపివేశారు. సీఈ ఎం.ప్రబాకర్ రావు ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
జాతీయ కరాటే పోటీల్లో జిల్లాకు ఆరు స్వర్ణాలు
కొత్తగూడెంఅర్బన్ (కొత్తగూడెంటౌన్): ఈనెల 24న కాజీపేటలో జరిగిన జాతీయ కుంగ్‌ఫూ – కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లాకు ఆరు బంగారు పతకాలు వచ్చాయని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి తెలిపారు. బాలుర అండర్ – 10 విభాగంలో 30 కేజీల కటాస్‌లో బి.భానుకృష్ణ, బాలికల విభాగంలో 33 కేజీల కటాస్‌లో ఎంఏ సనా, బాలుర అండర్ – 12 విభాగంలో 36 కేజీల కటాస్‌లో ఎ.జశ్వంత్, 40 కేజీల కటాస్‌లో ఎంఏ ఆయాన్, అండర్ –14లో 42 కేజీల కటాస్‌లో ఎల్.హర్షిత్‌కుమార్, బాలికల అండర్ –14 విభాగంలో 52 కేజీల కటాస్‌లో ఎ.ఆశ్రిత బంగారు పతకాలు సాధించారని వివరించారు. జిల్లా కుంగ్‌ఫూ – కరాటే అకాడమీ ప్రధాన కార్యదర్శి, కోచ్ నీహారిక శిక్షణలో 10 మంది పోటీలకు వెళ్లగా ఆరుగురు బంగారు పతకాలు గెలుచుకున్నారని పేర్కొన్నారు. విజేతలను యుగంధర్‌రెడ్డితో పాటు కరాటే మాజీ క్రీడాకారుడు కాశీహుస్సేన్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.రాజేంద్రప్రసాద్, చైర్మన్ కె.మహీధర్ అభినందించారు.
బాక్సింగ్ టోర్నీలో రజత పతకాలు..
కేయూ ఇంటర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు రజత పతకాలు సాధించారని కోచ్ సత్యబాబు తెలిపారు. పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కె.శ్రీసాయి ఉదయ్ 51, 54 కేజీల విభాగంలో, బి.హేమంత్‌కుమార్ 80, 85 కేజీలు, భద్రాచలం డిగ్రీ కాలేజీకి చెందిన వి.వినయ్‌కుమార్ 75, 80 కేజీల విభాగంలో పతకాలు సాధించారని పేర్కొన్నారు. వీరిని బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఎల్లయ్య, ఎస్‌బీఐ ఆర్‌ఎం ఆర్జున్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment