‘శివయ్య’కు మహారుద్రాభిషేకం
భద్రాచలం: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి ఉపాలయంలో సోమవారం మహారుద్రాభిషేకం, జ్వాలా తోరణం తదితర పూజలు జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గోదావరి మాతకు నదీ హారతి సమర్పించారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ..
శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామివారిని ముత్తంగి రూపంలో అలంకరించడం ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment