
ఇసుక లారీ పట్టివేత
అశ్వారావుపేటరూరల్: ఏపీ రాష్ట్రం నుంచి అక్రమంగా తెలంగాణలోకి రవాణా చేస్తున్న ఓ ఇసుక లారీని బుధవారం తెల్లవారుజామున స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా తాటిపూడి నుంచి టిప్పర్‌లో సుమారు 15 టన్నుల ఇసుకను అశ్వారావుపేటకు తీసుకురాగా, సమాచారం మేరకు గ్రామ శివారులో పట్టుకున్నారు. టిప్పర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి సీజ్ చేయగా, ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన లారీ యజమాని గంటా కొండబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.