
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్ చాట్‌జీపీటీ విడుదలతో ఉద్యోగుల భవిష్యత్ మరింత ప్రమాదంలో పడింది. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్‌ను అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఎలాన్ మస్క్‌లాంటి ప్రపంచ కుబేరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుందనే నివేదికలు ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఇటీవల,స్టెబిలిటీ ఏఐ సీఈవో ఎమాడ్ మోస్టాక్, పీటర్ హెచ్.డయామాండితో కలిసి మూన్షాట్స్ అండ్ మైండ్సెట్ పాడ్ కాస్ట్‌లో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో మనుషులు ప్రోగ్రామ్‌ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఎందుకంటే చాట్‌జీపీటీ టూల్స్ స్వయంగా కోడింగ్‌ను రూపొందిస్తున్నాయి.టెక్ రంగానికి కావాల్సిన కోడ్‌లను ప్రామాణికంగా, మరింత ఖచ్చితత్వంతో అందించేందుకు సహాయపడతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు జనరేటివ్ ఏఐ సైతం తనదైన ముద్రవేస్తుందని చెప్పారు.
టెక్కీల అవసరం ఉండదు
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ గిట్‌హబ్‌లో 41 శాతం కోడ్‌లను చాట్‌జీపీటీ తయారు చేసినవే. ఐదేళ్లలో ప్రోగ్రామర్ల అవసరం ఉండదు. దీనితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ ప్రోగ్రామర్లకు ముప్పు ఎక్కువగా ఉంది. వాళ్ల అవసరం ఇకపై ఉండదని చెప్పారు.
ఇంటర్నెట్‌తో పనిలేదు
2024 ముగిసే సమయానికి అందరి ఫోన్‌లలో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు దీన్ని వినియోగించాలంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా కావాల్సిన కార్యకలాపాలన్నీ చాట్‌జీపీటీలో చక్కబెట్టుకోవచ్చు. ఈ సందర్భంగా ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో చూడండి’ అని సీఈవో నొక్కి చెప్పారు. హెల్త్, సైన్స్ నిపుణులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అందుబాటులో ఉంచాలని, తద్వారా వారు తమ సామర్థ్యాన్ని, వేగాన్ని ఉపయోగించుకోగలరని అన్నారు.
భవిష్యత్తుపై ఓ లుక్కేయండి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అందరూ వినియోగించుకునేలా చూడాలని స్టెబిలిటీ ఏఐ సీఈఓ అభిప్రాయపడ్డారు. ఆడియో, వీడియో, డీఎన్ఏ, కెమికల్ రియాక్షన్స్, లాంగ్వేజ్ ఇలా అన్నీ ఇంటిగ్రేటెడ్ సొసైటీ ఓఎస్ అనే ఒకే పద్ధతి ఆధారంగా ఈ సంస్థ మోడల్‌ను అభివృద్ధి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
తద్వారా బోర్డు సభ్యుల స్థానంలో బ్యాంకర్ జీపీటీ, బోర్డు సభ్యుల స్థానంలో బోర్డు జీపీటీ ఉంటాయి. ఈ సృజనాత్మక ఆలోచన ప్రతి ఒక్కరినీ ఒక ఫైలును తయారు చేసుకోవచ్చు. ఇందులో వారు పదాలు, చిత్రాలు, ఆడియో, టెక్స్ట్ లేదా వారికి సంబంధించిన ఇతర సమాచారాన్ని కలుపుకునే అవకాశాన్ని అందిస్తుందని చెప్పారు.
చదవండి : 10 ఏళ్లలో ‘AI’తో మానవాళి వినాశనమే.. సీఈవోల సంచలన వ్యాఖ్యలు!